మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. యోగాసనాలు
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 12 జూన్ 2018 (19:53 IST)

యోగాసనాలు చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందా?

ఆరోగ్యం అంటే అందరూ శరీరానికి సంబంధించినదని అనుకుంటారు. కానీ నిజమైన ఆరోగ్యానికి మూలాలు మనస్సులో ఉంటాయి. మనస్సు నిర్మలంగా, నిశ్చలంగా ఉన్నచోటు వ్యాధులకు ఆస్కారం చాలా తక్కువ. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగ

ఆరోగ్యం అంటే అందరూ శరీరానికి సంబంధించినదని అనుకుంటారు. కానీ నిజమైన ఆరోగ్యానికి మూలాలు మనస్సులో ఉంటాయి. మనస్సు నిర్మలంగా, నిశ్చలంగా ఉన్నచోటు వ్యాధులకు ఆస్కారం చాలా తక్కువ. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్టు. శరీరాన్ని మనస్సును బ్యాలెన్స్ చేసే శక్తి యోగాభ్యాసానికి మాత్రమే ఉంది.
 
యోగాకున్న సమగ్రత, సంపూర్ణత్వం ఇతర వ్యాయామాలకు ఉండదు. శారీరక వ్యాయామాన్ని మించిన ప్రయోజనాలున్నందునే పాశ్చాత్య ప్రపంచం కూడా యోగా పట్ల ఆకర్షితులవుతున్నారు. యోగాసనాలు వలన రక్తప్రసరణ మెరుగుపడుతుంది. శరీరం నుండి విషతుల్యాలు వేగంగా బయటకు వెళ్లిపోతాయి. మనస్సును శ్వాసప్రక్రియపై చేసి ఏకాగ్రత సాధన చెయ్యడం వల్ల మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది.
 
యోగాతో సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక బలంతో నిత్యం యవ్వనంగా జీవించవచ్చును. ప్రతిరోజు కొద్దిసేపు యోగా చేస్తే నిపుణుల తగ్గరకు వెళ్లవలసిన అవసరం ఉండదు. యోగా ఒక మతానికి సంబంధించినది కాదు. ఇది కేవలం ఆరోగ్యానికి మాత్రమే సంబంధించిన ప్రక్రియ అనే విషయాన్ని గుర్తించాలి. యోగాను మతంతో ముడిపెట్టే ప్రయత్నం చేయడం దురదృష్టకరం.