1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
  4. CHAIRMAN INSPECTS ALIPIRI FOOTPATH ROUTE

అలిపిరి నడకదారిని ఆకస్మికంగా పరిశీలించిన టీటీడీ ఛైర్మన్

TTD
తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే అలిపిరి నడకదారిని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి చదలవాడ కృష్ణమూర్తి సోమవారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు. గాలిగోపురం నుంచి ఆయన అలిపిరి వరకూ ఉన్న వసతులను పరికించి చూశారు. భక్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 
 
సోమవారం ఉదయం తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఉన్నట్లుండి గాలిగోపురాన్ని చేరుకున్నారు. అక్కడ నుంచి కాలి నడక అలిపిరి వరకూ వచ్చారు. దారిలో భక్తులతో మాట్లాడారు. గాయపడి భక్తులకు సౌకర్యాలు ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు. దర్శన టోకెన్లు మొదలుకుని లగేజీ, మజ్జిగ, నీళ్ళ వసతిపై ఆరా తీశారు. 
 
About Writer
pyr