బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (13:24 IST)

భార్య కాదు గయ్యాళిది.. వైన్ గ్లాస్ పైకి విసిరేది.. బెడ్ మీద..?

Johnny Depp
Johnny Depp
పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న హీరో జానీ డెప్‌కు భార్యతో వేధింపులు తప్పలేదు. తాజాగా మాజీ భార్య రాసిన వ్యాసంపై రూ.380కోట్ల పరువు నష్టం దావా వేశాడు.
 
జానీ డెప్ మూడేళ్ల డేటింగ్‌ అనంతరం నటి అంబర్‌ హెర్డ్‌ను 2015లోరెండో వివాహం చేసుకున్నాడు. పెళ్ళైన ఏడాదికే వారిద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. దీంతో ఈ జంట పెళ్లి మూడు నాళ్ళ ముచ్చటగా మారింది. రెండేళ్లకే వీరు విడాకులు తీసుకొని విడిపోయారు. 
 
ఇక విడిపోయాక అంబర్ తానూ గృహహింస బాధితురాలినని తెలుపుతూ ఒక వ్యాసం రాసింది. అది కాస్తా వైరల్ కావడంతో ఆ వ్యాసాన్ని వ్యతిరేకిస్తూ జాన్ కోర్టు మెట్లెక్కాడు. మాజీ భార్యపై రూ.380కోట్ల పరువు నష్టం దావా వేశాడు. ప్రస్తుతం ఈ కేసు వర్జీనియా కోర్టులో రెండో వారానికి చేరుకొంది.
 
ఈసారి కోర్టులో జాన్ తన భార్య చేసిన ఆగడాలను ఏకరువు పెట్టాడు. ఆమె నన్ను కొట్టేది. టీవీ రిమోట్‌, వైన్‌ గ్లాస్‌ తలపై విసిరేది. అంతేకాకుండా మలాన్ని బెడ్‌పై ఉంచేది.. అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జాన్ మాటలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇకపోతే రెండో వారం కూడా కోర్టు ఈ కేసును వాయిదా వేసింది.