శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 19 జూన్ 2021 (18:54 IST)

స్టాలిన్‌కు రెండు కోట్ల విరాళం అంద‌జేసిన లైకా సంస్థ

Lyca production-Stalin
క‌రోనా త‌ర్వాత రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌డుడున్న‌త సంస్క‌ర‌ణ‌ల కోసం ప్ర‌ముఖులు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రికి విరాళాలు అంద‌జేస్తున్నారు.తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి లైకా ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత శ్రీ అల్లిరాజా సుభాస్కరన్ రెండు కోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు.
 
అల్లిరాజా సుభాస్కరన్ తరపున గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ తిరు ఎంకే స్టాలిన్ ను సచివాలయంలో కలిసిన  లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు శ్రీ జీకేఎం తమిళ్ కుమరన్, శ్రీ నిరుతన్, శ్రీ గౌరవ్ రూ. 2 కోట్ల చెక్ అందజేశారు
 
2014లో లైకా ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌ను స్థాపించి మురుగ‌దాస్‌తో `క‌త్తి` సినిమాను శంక‌ర్‌, ర‌జ‌నీకాంత్ రోబో 2.0 సినిమాలు నిర్మించారు. ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాలు నిర్మించిన ఈ సంస్థ తాజాగా హిందీలో `గుడ్ ల‌క్ జెర్సీ` సినిమాను నిర్మిస్తోంది. అంతేకాకుండా మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో పొన్నియిన్ సెల్వన్ సినిమాను నిర్మిస్తోంది. అంతేకాకుండా అక్షయ్ కుమార్‌తో అభిషేక్ శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో హిందీ సినిమాను నిర్మిస్తోంది.