సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : ఆదివారం, 4 నవంబరు 2018 (11:44 IST)

నిమ్మతో ఇలా చేస్తే బరువుకు చెక్... గోరు వెచ్చని నీటితో తాగితే...

నిమ్మకాయ.. దీనిగురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం మన కళ్లకు కనిపించే పండు. ఈ నిమ్మపండు వల్ల ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏ కాలంలో అయినా దొరికే నిమ్మలో ఎన్నో ఔషధాలు దాగివున్నాయి. ముఖ్యంగా, ప్రతిరోజూ నిమ్మరసం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. 
 
వయసుతో నిమిత్తం లేకుండా ఈ నిమ్మరసాన్ని వివిధ రకాలుగా తీసుకోవచ్చు. జీర్ణశక్తిని పెంచడమే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. ప్రత్యేకించి చిన్నపిల్లలకు ప్రతీరోజు నిమ్మరసాన్ని తాగిస్తే వారిలో జ్ఞాపకశక్తి పెరిగే అవకాశం ఉంది. రోజూ గోరువెచ్చని నీటితో తీసుకుంటే బరువు తగ్గుతారు. రోజు నిమ్మరసాన్ని ఒక ప్రణాళిక ప్రకారం తీసుకుంటే పలు ప్రయోజనాలు ఉన్నాయి. 
 
* గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, చక్కెర కలుపుకొని తాగటం ఎంతో మంచిది. శుభ్రమైన నీటిని మరిగించి మనం తాగే వేడి వరకు చల్లార్చాలి. కాచిన గ్లాస్‌ నీటిలో గింజలు రాకుండా ఒక నిమ్మకాయ రసం పిండి పరగడుపున తీసుకోవాలి. తర్వాత గంటకి అల్పాహారం తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ఆరోగ్యపరంగా పలు ప్రయోజనాలు కలుగుతాయి.
 
* ప్రతీరోజు వేడినీటితో నిమ్మరసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా కాలేయం శుభ్రపడటంతోపాటు పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాక కాలేయం మరిన్ని ఎంజైమ్స్‌ను ఉత్పత్తి చేస్తుంది.
* ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మలబద్ధకం తగ్గిపోతుంది. నిమ్మరసం రక్తంలో త్వరగా కలిసిపోయి అన్ని అవయవాలు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది.
* భోజనానికి ముందు నిమ్మరసం తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యూరిక్‌ యాసిడ్‌ను పలుచన చేసి కీళ్లనొప్పులు, గేట్స్‌ వంటి రుగ్మతలను తగ్గిస్తుంది.
* చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. నోటిలో బాగా లాలాజలం ఊరుతుంది. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది.
* శరీరంలోని కఫాన్ని తగ్గిస్తుంది. అధిక బరువును అదుపులోకి తెస్తుంది.
* శరీరంలో వేడిని నియంత్రించి, శరీరానికి కావాల్సిన చలువదనాన్ని అందిస్తుంది.
 
* అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. 
* నిమ్మరసంలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. 
* పోటాషియం వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. 
* ఈ రసం సోడియంతో కలిసి మెదడు, నాడీ వ్యవస్థల పనితీరును మెరుగుపరుస్తుంది. 
* రక్తంలో పోటాషియం నిల్వలు తగినన్ని ఉంటే మానసిక ఆందోళన, ఒత్తిడి మందకొడితనం వంటి సమస్యలు దరిచేరవు.
* రక్తంలో క్యాల్షియం, మెగ్నీషియం నిల్వలు సమృద్ధిగా ఏర్పడుతాయి. తగినంత స్థాయిలో కాల్షియం ఉండటం వల్ల రికెట్స్‌ వ్యాధి సోకే అవకాశం ఉండదు. మెగ్నీషియం గుండెకు చాలా మంచిది.