గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (17:07 IST)

ఆ శక్తి లేక పురుషులు డీలా... ఈ 4 తింటే అపారం...

ఇటీవలి కాలంలో పురుషుల్లో వాతావరణ కాలుష్యం, సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల గానీ శృంగార పరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని తగ్గించుకోవడానికి అనేక రకములైన మందులు ఉన్నప్పటికి వాటిని వాడటం వలన వేరే రకమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అలాకాకుండా ఉండాలంటే ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే కొన్ని పదార్థాలతో ఈ సమస్యల్ని తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం. 
 
1. పచ్చిరొయ్యలు... పచ్చిరొయ్యల్లో జింక్ హెచ్చుస్థాయిలో ఉంటుంది. మగవారు వీటిని తీసుకోవడం వలన సంభోగ శక్తిని పెంచడమే కాకుండా వీర్యవృద్ధిని, ఉత్పత్తిని పెంచుతుంది.
 
2. ఉల్లిపాయ.... ఒక స్పూన్ ఉల్లిపాయ రసం, ఒక స్పూన్ ఆవు నెయ్యి, అరస్పూన్ తేనెను ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో చప్పరిస్తూ, రాత్రి సమయంలో పాలు తాగితే స్తంభన సమస్యను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచడంతో పాటు వీర్యవృద్ధిని పెంచుతుంది.
 
3. ముల్లంగి గింజలు... ఒక స్పూన్ ముల్లంగి గింజల్ని ఆవు పాలలో వేసి బాగా కాచి, చల్లార్చి వడకట్టి, ఆ పాలను రాత్రి పడుకునే ముందు తాగుతుంటే శీఘ్రస్ఖలన సమస్య నుండి బయటపడవచ్చు.
 
4. అత్తిపండు... అత్తిపండ్లు శృంగార వాంఛను కలిగించి, శృంగారంలో పాల్గొనే వారికి నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి. బలహీనతను పోగొట్టి శృంగారానికి సన్నద్ధం చేస్తాయి. వీటిని నేరుగా గాని లేదా బాదం, ఖర్జూరం వంటి ఇతర ఎండు ఫలాలతోగాని వాడుకోవచ్చు. వెన్నతో కలిపి తీసుకుంటే వీటి శక్తి ఇనుమడిస్తుంది.