హనోయిలోని అపార్ట్‌మెంట్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. 50మంది సజీవదహనం
వియత్నాం రాజధాని హనోయిలోని అపార్ట్‌మెంట్ బ్లాక్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు. 50మంది సజీవదహనం అయ్యారు. మంగళవారం అర్ధరాత్రి 10-అంతస్థుల భవనంలోని పార్కింగ్ ఫ్లోర్‌లో మోటర్‌బైక్‌లతో నిండిన ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అక్కడకు చేరిన అగ్నిమాపక సిబ్బంది దాదాపు 70 మందిని రక్షించారు. అలాగే 54 మందిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో "డజన్ల కొద్దీ మరణించారు" అని అధికారిక వియత్నాం న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
చనిపోయినవారిలో కనీసం ముగ్గురు పిల్లలు ఉన్నారని ఆన్‌లైన్ స్టేట్ వార్తాపత్రిక వియెట్‌టైమ్స్ తెలిపింది.
రాత్రిపూట కావడంతో చాలామంది నిద్రలోనే మృత్యువు ఒడిలోకి చేరుకున్నారు. అపార్ట్ మెంట్ కావడంతో తప్పించుకునే దారిలేక చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కాంప్లెక్స్‌లో దాదాపు 150 మంది నివసిస్తున్నారని అధికారులు తెలిపారు.