బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 అక్టోబరు 2020 (11:59 IST)

పేలుళ్లతో దద్ధరిల్లిన ఆప్ఘనిస్థాన్.. ఐదు రోజుల్లో 58 మంది మృతి

ఆప్ఘనిస్థాన్ పేలుళ్లతో దద్ధరిల్లుతోంది. ఈ నెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరిగిన నాలుగు పేలుళ్లలో 58 మంది పౌరులు మరణించారు. నాలుగు ప్రావిన్సుల్లో కేవలం ఐదు రోజుల్లోనే జరిగిన పేలుళ్లలో 58 మంది మరణించగా, మరో 143 మంది తీవ్రంగా గాయపడ్డారని తేలింది. 
 
జబూల్ ప్రావిన్సు పరిధిలోని కాబూల్, ఖోస్ట్‌లలో జరిగిన పేలుళ్లలో 30 మందికి పైగా మరణించగా, మరో 77 మంది విద్యార్థులు గాయపడ్డారు. మంగళవారం జరిగిన మరో పేలుడులో ఐదుగురు పౌరులు మరణించగా, మొత్తం 33 మంది గాయపడ్డారు.
 
అలాగే కాబూల్‌లో మరో పేలుడు ఘటనలో ఐదుగురు మృతి చెందగా 13 మంది గాయపడ్డారు. జబుల్‌లో జరిగిన రెండు పేలుళ్లలో 18 మంది మరణించారు. ఆఫ్ఘనిస్తాన్ దేశంలో జరిగిన పేలుళ్లలో 30 మంది పిల్లలు మరణించారని మానవ హక్కుల కమిషన్ పేర్కొంది.
 
హషీం నజారీ అనే ఓ విద్యార్థి పాఠశాలకు వెళుతూ పేలుళ్లలో మరణించాడు. ఆప్ఘనిస్థాన్ దేశంలో పేలుళ్లకు పాల్పడుతూ మానవ హక్కులను హరిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఉగ్రవాదులే ఈ పేలుళ్లకు కారణమని తేలింది.