శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 నవంబరు 2023 (09:09 IST)

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశం.. 97వేలకు పెరిగిన భారతీయులు

Indians
Indians
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన దాదాపు 97 వేల మంది భారతీయులను (అమెరికా సరిహద్దులను అక్రమంగా దాటిన భారతీయులు) సరిహద్దుల్లో అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ప్రధానంగా కెనడా, మెక్సికో సరిహద్దుల నుంచి చాలా మంది భారతీయులు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అమెరికాలో అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 
 
గత ఏడాదితో పోలిస్తే 2019-2020లో అమెరికాలో అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన భారతీయుల సంఖ్య దాదాపు ఐదు రెట్లు పెరిగింది. అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 వరకు అమెరికాలో అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన భారతీయుల సంఖ్య 96,917. సరిహద్దుల్లో అమెరికా అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 
 
2019-2020లో అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించి అరెస్టయిన భారతీయుల సంఖ్య 19,883 మాత్రమే. ఈ డేటాను యూఎస్ కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ (UCBP) అధికారులు వెల్లడించారు.