గూగుల్ సీఈఓనే ఉద్యోగం అడిగిన చిన్నారి: అలాగే అన్నసుందర్‌పిచాయ్
గూగుల్ సంస్థలో ఉద్యోగం చేయడం ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షలమంది ఏటా కనే కల. ఆ కల నిజమైతే జీవితం ఏ స్థాయికి వెళుతుందో బయటినుంచి ఊహించలేం. అలాంటిది ఒక ఏడేళ్ల చిన్నారి తండ్రి చెప్పిన మాట విని నేరుగా గూగుల్ సీఈఓకే ఉత్తరం రాసి మరీ తన అభిరుచులు, ఆకాంక్షలు
గూగుల్ సంస్థలో ఉద్యోగం చేయడం ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షలమంది ఏటా కనే కల. ఆ కల నిజమైతే జీవితం ఏ స్థాయికి వెళుతుందో బయటినుంచి ఊహించలేం. అలాంటిది ఒక ఏడేళ్ల చిన్నారి తండ్రి చెప్పిన మాట విని నేరుగా గూగుల్ సీఈఓకే ఉత్తరం రాసి మరీ తన అభిరుచులు, ఆకాంక్షలు వెల్లడించింది. గూగుల్‌లో ఉద్యోగం చేయడం, ఒలింపిక్ గేమ్స్‌లో పతకం సాధించడం వంటి కలలున్నాయని తెలిపింది. ఇంతకూ నువ్వు నాకు ఉద్యోగం ఇస్తావా ఇవ్వవా అనే రేంజిలో లెటర్ రాసి మరీ పంపింది. సోషల్ మీడియా ఈ ఉత్తరం ఇప్పుడు ఒక సంచలనాత్మకమైన ట్రెండ్ అయింది. దానికి గూగుల్ సీఈవో ఇచ్చిన సమాధానం మరింత వైరల్ అయిపోయింది.
నీ చదువు పూర్తవగానే గూగుల్‌కి మళ్లీ దరఖాస్తు చేసుకో అంటూ సీఈవో రాసిన ఉత్తరం అందరినీ కదిలిస్తోంది.
గూగుల్‌లో ఉద్యోగం కావాలంటూ ఏడేళ్ల ఒక చిన్నారి పెట్టుకున్న దరఖాస్తుకు ఆ సంస్థ సీఈవో సుందర్‌పిచాయ్ సమాధానమిచ్చి అందరినీ ఆశ్చర్చపరిచారు. ఇంగ్లండ్‌లోని హియర్‌ఫోర్డ్‌కు చెందిన ఏడేళ్ల క్లో బ్రిడ్జ్‌వాటర్ సరదాగా ఒకరోజు తాను ఎక్కడ పనిచేస్తే బాగుంటుందో చెప్పాలంటూ తన తండ్రిని అడిగింది. దీనికి గూగుల్ అయితే బాగుంటుందని పాప తండ్రి ఆండీ బదులిచ్చాడు. వెంటనే ఆ అమ్మాయి గూగుల్ సీఈవో పిచాయ్‌ను ‘గూగుల్ బాస్’ అని సంబోధిస్తూ ఉద్యోగం కోసం లేఖ రాసింది.
తాను చదువులో బాగా ముందుంటానని టీచర్లు కితాబిచ్చినట్లు ఆ లేఖలో చెప్పుకొచ్చింది. తనకు కంప్యూటర్, స్విమ్మింగ్ అంటే బాగా ఇష్టమని, స్విమ్మింగ్‌లో ఒలింపిక్ పతకం సాధిస్తానని తెలిపింది. తన తండ్రి ఇచ్చిన ట్యాబ్లెట్‌లో తాను రోబో ఆటను ఆడతానని, దానిద్వారా కంప్యూటర్ల గురించి నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని తన తండ్రి చెప్పినట్లు వివరించింది.
దీనికి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అంతే ధీటుగా సమాధానమిచ్చారు. సమాధానమిస్తూ.. ‘నీ లేఖకు కృతజ్ఞతలు. నీకు కంప్యూటర్లు, రోబోలు ఇష్టమన్నావు. టెక్నాలజీ గురించి ఇంకా తెలుసుకోవడం కొనసాగించు. ఎప్పుడూ ఇలాగే కష్టపడు. గూగుల్‌లో పని చేయడం, ఒలింపిక్స్‌లో పతకం సాధించడంతో పాటు అన్ని లక్ష్యాలను చేరుకుంటావని భావిస్తున్నాను. నీ చదువు పూర్తవగానే గూగుల్‌కి మళ్లీ దరఖాస్తు చేసుకో’ అంటూ పేర్కొన్నారు.