డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే ఎంత డేంజరో ఈ వీడియో చూడండి!
చాలా మంది ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుంటారు. ఇలాంటి వారు ప్రమాదాలకు గురై తృటిలో ప్రాణాలు కోల్పోతుంటారు. అలాగే, ప్రధాన రహదారులపై ఉన్నట్టుండి గుంతలు ఏర్పడుతుంటాయి. ఆకస్మికంగా ఏర్పడే ఈ గుంతల్లో పడ
చాలా మంది ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుంటారు. ఇలాంటి వారు ప్రమాదాలకు గురై తృటిలో ప్రాణాలు కోల్పోతుంటారు. అలాగే, ప్రధాన రహదారులపై ఉన్నట్టుండి గుంతలు ఏర్పడుతుంటాయి. ఆకస్మికంగా ఏర్పడే ఈ గుంతల్లో పడి మరికొందరు దుర్మరణం చెందుతారు.
ఇపుడు ఇలాంటి ప్రమాదం ఒకటి జరిగింది. చైనా రోడ్డుపై సడెన్‌గా పెద్ద గుంత ఏర్పడింది. 32 అడుగుల వెడల్పు, 6 అడుగుల లోతు సింక్‌హోల్ అది. ఇంతలో ఓ వ్యక్తి స్కూటర్ నడుపుతూ, ఫోన్ మాట్లాడుతూ వచ్చి ఆ గుంతలో పడ్డాడు.
చైనాలోని గుయాంగ్జి సిటీలో ఈ ఘటన జరిగింది. ఫోన్‌లో బిజీగా ఉన్న ఆ వ్యక్తి రోడ్డు అంత పెద్ద గుంత ఉన్నది కూడా గమనించలేదు. స్కూటర్ ఏమాత్రం స్లో చేయకుండా నేరుగా వచ్చి అందులో పడిపోవడం అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
అయితే ఇంత జరిగినా అతనికి మాత్రం ఏమాత్రం గాయాలు కాలేదు. పైగా అతనే ఎలాగోలా కష్టపడి పైకి వచ్చాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన గంటల్లోనే వేల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే ఎంత డేంజరో ఈ వీడియో చూస్తే మీకూ తెలుస్తుంది.