శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2017 (11:38 IST)

పరాయి పురుషుడితో మాట్లాడిందని... భార్య చెవులు కోసిన భర్త

ఆప్ఘనిస్థాన్‌లో దారుణం జరిగింది. భార్య పరాయి పురుషుడితో మాట్లాడిందన్న అక్కసుతో ఆమె రెండు చెవులను కసాయి భర్త కోసేశాడు. ఆప్ఘనిస్థాన్ దేశంలోని మజార్ ఐ షరీఫ్ నగరంలో ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ

ఆప్ఘనిస్థాన్‌లో దారుణం జరిగింది. భార్య పరాయి పురుషుడితో మాట్లాడిందన్న అక్కసుతో ఆమె రెండు చెవులను కసాయి భర్త కోసేశాడు. ఆప్ఘనిస్థాన్ దేశంలోని మజార్ ఐ షరీఫ్ నగరంలో ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.... 
 
జరీనా అనే 23 యేళ్ల మహిళ... తమ ఇంటి పొరుగున ఉన్న వ్యక్తితో తరచూ మాట్లాడుతూ వచ్చింది. దీన్ని ఆమె భర్త చూసి ఆగ్రహోద్రుక్తుడయ్యాడు. దీంతో భార్య చెవులను అత్యంత కిరాతకంగా ఆ కసాయి భర్త కోశాడు. రెండు చెవులు కోయడం వల్ల తీవ్రంగా గాయపడిని జరీనా మజార్ ఐ షరీఫ్ నగరంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 
 
13 ఏళ్ల వయసులోనే పెళ్లాడిన తనను భర్త చెవులు కోసినందున అతన్ని కఠినంగా శిక్షించాలని, అతనికి తాను విడాకులు ఇస్తానని జరీనా పేర్కొంది. భార్య చెవులు కోసి పారిపోయిన భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాలిబన్ల పాలన ముగియడంతో మళ్లీ అప్ఘనిస్థాన్ దేశంలో మహిళలపై అరాచకాలు ఎక్కువయ్యాయి.