గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 4 సెప్టెంబరు 2021 (12:18 IST)

సెక్స్ వర్కర్ల జాబితాను తయారు చేస్తున్న తాలిబన్ తీవ్రవాదులు

ఆప్ఘనిస్థాన్ దేశాన్ని ఆక్రమించుకున్న తాలిబన్ తీవ్రవాదులు తమ రాక్షస చర్యలను ముమ్మరం చేస్తున్నారు. మహిళల హక్కులను కాలరాసే కఠినమైన షరియా చట్టాలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 
 
ఇందులోభాగంగా తమ దేశంలోని సెక్స్ వర్కర్ల జాబితాను తాలిబన్లు సిద్ధం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ జాబితా తయారు చేసిన తర్వాత సెక్స్ వర్కర్లకు షరియా చట్టాల మేరకు వీరికి బహిరంగ మరణశిక్ష విధించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తుున్నాయి. 
 
అది సాధ్యపడకపోతే, ఆ సెక్స్ వర్కర్లను లైంగిక వెట్టిచాకిరీలుగా వాడుకోవాలన్న యోచనలో తాలిబన్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరి గుర్తింపునకు అడల్ట్ కంటెంట్ వెబ్‌సైట్స్‌ సాయం తీసుకుంటున్నారు. 
 
విదేశీయులతో శృంగారంలో పాల్గొన్న ఆఫ్గన్ మహిళలను గుర్తించి, వారికి మరణశిక్ష వేయాలని తాలిబన్లు భావిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. గతంలో తమ దేశంలో వేశ్యలుగా పనిచేసిన మహిళలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని కూడా వారు చేపట్టారు. 
 
కాగా, ఆప్ఘనిస్థాన్‌లో గత 20 యేళ్లుగా అధికారానికి తాలిబన్ తీవ్రవాదులు దూరంగా ఉన్నప్పటికీ మహిళలకు వ్యతిరేకంగా తమ అఘాయిత్యాలను మాత్రం యాధావిధిగా కొనసాగించారు. ఇతర పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకోవడం లేదా వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళలను తాలిబన్లు అత్యంత కిరాతకంగా హతమార్చారు.