Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో కరోనా రక్కసి విలయతాండవం.. ఒకే రోజు 2వేల మంది మృతి

Written By సెల్వి
Updated: బుధవారం, 15 ఏప్రియల్ 2020 (11:12 IST)
ప్రాణాంతక వైరస్ కరోనా ద్వారా ఒక్క రోజే అమెరికాలో 2వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్‌తో అమెరికా విలవిలలాడుతోంది. దీంతో రోజు రోజుకీ పాజిటివ్ కేసులు కొత్తగా నమోదవుతూనే.. కరోనా మృతులు కూడా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఒక్కరోజే 2,129 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 25వేలు దాటింది. 
 
దేశంలో గత 24 గంటల్లో ఆరు లక్షలకు పైగా అమెరికన్లకు కరోనా పాజిటివ్‌ పరీక్షలు నిర్వహించారు. అమెరికాలో కరోనాకు కేంద్రబిందువుగా మారిన న్యూయార్కులో 10,842 మంది మృతి చెందారు. ఇందులో ఒక్కసారి కూడా కరోనా పరీక్షలు చేయించుకోనివారు నాలుగువేల మంది ఉన్నారు. 
 
ఈ వైరస్‌ వల్ల మరో 3778 మంది మరణించే అవకాశం ఉన్నదని ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు నగరంలో 2,03,020 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 25,981 మంది మృతి చెందారు.

అన్నీ చూడండి

యశ్ 'టాక్సిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అపశృతి - మల్లారెడ్డి వర్శిటీపై కేసు

దుష్ప్రచారం చేస్తే రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా : గోవిందా హెచ్చరికలు

బాలీవుడ్ హీరోహీరోయిన్ల మధ్య వయసు అంతరం : మనీషా కోయిరాలా

మూడోసారి గర్భమా? అది ప్రెగ్నెన్సీ కాదు.. పిజ్జా తినడం వల్లే...

ఇకపై కేవలం బ్లాక్‌బస్టర్ చిత్రాలే తీస్తా : నిర్మాత బండ్ల గణేశ్

తర్వాతి కథనం
Show comments