గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2020 (11:07 IST)

తెలంగాణలో కరోనా-644 కేసులు నమోదు..18 మంది మృతి

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటివరకు కరోనా కేసులు 644 నమోదైనాయి. మంగళవారం ఒక్కరోజే 51 పాజిటివ్ కేసులు నమోదైనాయి.  ఇందులో హైదరాబాద్‌లోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు 307 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 18 మంది మృతి చెందారు. హైదరాబాదుతో పాటు ప్రత్యేకంగా కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. 
 
కంటైన్మెంట్ జోన్లలోని ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రాకుండా మరింత కఠినంగా నిబంధనలను అమలు చేస్తోంది. ఇకపోతే.. హైదరాబాద్‌లో త్వరలోనే ప్లాస్మా చికిత్సను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఒకవేళ.. ఈ వైద్య సదుపాయం అందుబాటులోకి వస్తే.. కరోనా బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించి, వారిని కాపాడుకోవచ్చునని తెలంగాణ సర్కారు వెల్లడించింది.