బుధవారం, 21 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 జూన్ 2022 (17:28 IST)

సౌతాఫ్రికా నైట్ క్లబ్‌లో 20 మంది అనుమానాస్పద మృతి

deadbody
దక్షిణాఫ్రికాలోని ఈస్ట్ లండన్‌ సిటీలోని ఒక నైట్ క్లబ్‌లో 20 మంది అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. ఈ విషయం ఆదివారం తెల్లవారుజామున వెలుగులోకి వచ్చింది. ఈ క్లబ్‌లో పలు ప్రదేశాల్లో మృతదేహాలు పడివున్నట్లు సమాచారం. మృతుల శరీరాలపై గాయాలు లేకపోవడంతో మరణానికి కారణాలు వెంటనే చెప్పలేమని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని చెబుతున్నారు.
 
ఈ ఘటనపై ఈస్టర్న్ కేప్ పోలీసు ప్రతినిధి బ్రిగేడియర్ టెంబిన్‍కోసి కినాన్ స్పందిస్తూ 20 మంది చెందినట్టు పోలీసులు ధృవీకరిస్తున్నారని, ఈ ఘటన ఈస్ట్ లండన్‌లోని సినరీ పార్క్‌లో జరిగినట్టు తెలిపారు. దీంతో అక్కడున్న పరిస్థితులను అధ్యయనం చేస్తున్నట్టు తెలిపారు. పైగా, మృతులకు సంబంధించి పుకార్లకు అవకాశం ఇవ్వమని ఆయన తెలిపారు. అయితే, మృతుల సంఖ్య 20కిపైగా ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.