గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 జూన్ 2022 (09:53 IST)

ఓస్లోలో గే బార్‌ నైట్ క్లబ్బులో కాల్పులు - ఇద్దరు మృతి

shoot
నార్వే రాజధాని ఓస్లోలోని ఓ నైట్ క్లబ్‌లు కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది మృత్యువాతపడ్డారు. శనివారం నగరంలోని ప్రముఖ లండన్ పబ్ (గే బార్, నైట్ క్లబ్)లోకి ప్రవేశించిన దండుగులు ఈ కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు. 
 
ఈ కాల్పుల ఘటన తర్వాత ఓ దండుగుడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన కారణాలు ఇంకా తెలియరాలేదు. అలాగే, ఈ కాల్పుల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు వారు తెలిపారు.