గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 జూన్ 2022 (20:10 IST)

మహారాష్ట్రలో దారుణం: ఒకే ఇంట్లో 9 మృతదేహాలు

crime scene
మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఒకే ఇంట్లో 9 మృతదేహాలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మాయిసాల్ గ్రామానికి చెందిన వీరంతా ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. 
 
వీరిలో ముగ్గురి మృతదేహాలు ఒకే చోట పడివుండగా, మిగిలిన ఆరు మృతదేహాలు ఇంట్లో వివిధ చోట్ల పడివుండడాన్ని పోలీసులు గుర్తించారు. 
 
వారంతా విషం తాగి చనిపోయి ఉంటారని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పోస్టుమార్టం అనంతరం దీనిపై స్పష్టత రానుంది. వారి ఆత్మహత్యకు కారణమేంటన్నది తెలియరాలేదు.