ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 మార్చి 2021 (10:09 IST)

ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం: 27మంది మృతి.. 35 మందికి గాయాలు

ఇండోనేషియాలోని జావాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జావా ప్రావిన్స్‌ సుబంగ్‌ పట్టణం నుండి బయలు దేరిన పర్యాటక బస్సు లోయలో పడిపోవడంతో 27మంది ప్రయాణీకులు మృతి చెందారు. డ్రైవర్‌తో సహా మరో 35 మంది గాయపడ్డారు. బస్సు బ్రేకులు ఫేయిల్‌ కావడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. 
 
ఇస్లామిక్‌ జూనియర్‌ హైస్కూల్‌ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తాసిక్మాలయ జిల్లాలోని ఓ తీర్థయాత్రకు తీసుకెళ్తుండగా బస్సు లోయలో పడిపోయింది. బుధవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. 
 
వాహనం డ్రైవర్‌ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో సుమారు 20 అడుగుల లోతులో ఉన్న లోయలో బస్సు పడిపోయిందని పేర్కొన్నారు. సువేదాంగ్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. అయితే, ప్రాణాలతో బయటపడ్డ బాధితులంతా వాహనం బ్రేకులు సరిగా పనిచేయలేదని అధికారులకు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.