మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 మార్చి 2021 (16:42 IST)

హైదరాబాద్‌లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు.. 25 మాత్రమే కొంటున్నారట..!

హైదరాబాద్‌లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు రానున్నాయి. కానీ సాధారణ బస్సులతో పోల్చుకుంటే ఈ బస్సుల నిర్వహణ వ్యయం చాలా ఎక్కువ. అందుకే అప్పట్లో డిమాండ్‌ ఉన్నప్పటికీ నష్టాలు భరించలేక ఆర్టీసీ వాటిని వదిలించుకుంది. తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో ఆర్టీసీ ఈ బస్సులు తీసుకుంటోంది. ఎంత కొత్తతరం నమూనా బస్సు అయినా.. నిర్వహణ వ్యయం మాత్రం తడిసి మోపెడవుతుందని అధికారులు భయపడుతున్నారు. 
 
తొలుత 40 బస్సులను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలనే ఆదేశాలు వచ్చినా.. ఖర్చుకు భయపడి 25 మాత్రమే కొంటున్నారు. ఒకవేళ నష్టాలు వస్తే వాటికి తగ్గట్టుగా ప్రభుత్వం రాయితీలు ఇస్తే అవసరమైనన్ని కొనాలని అధికారులు భావిస్తున్నారు. 
 
దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో మెట్రో నగరాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి ప్రత్యేక ఐకానిక్‌గా నిలవనుంది డబుల్ డెక్కర్ బస్సు. అశోక్ లేలాండ్ సంస్థ ఈ బస్సులను ప్రభుత్వానికి అందించనుంది.