బంగ్లాదేశ్‌లో నిత్యపెళ్ళికొడుకు అరెస్ట్.. ఏకంగా 28మందిని పెళ్ళాడాడు..
బంగ్లాదేశ్‌లో నిత్యపెళ్ళి కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 28మంది యువతులను పెళ్లాడాడు. అయితే వరకట్నం వేధింపులతో ఈ యవ్వారం బయటికి వచ్చింది. తన భర్త వరకట్నం కోసం వేధ
బంగ్లాదేశ్‌లో నిత్యపెళ్ళి కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 28మంది యువతులను పెళ్లాడాడు. అయితే వరకట్నం వేధింపులతో ఈ యవ్వారం బయటికి వచ్చింది. తన భర్త వరకట్నం కోసం వేధిస్తున్నాడని 25వ భార్య తానియా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నిత్య పెళ్లికొడుకు నిర్వాకం బయటపడింది.
వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ లోని బర్గుణ జిల్లా తాల్కలి పట్టణానికి చెందిన యాసిన్ బైపారి అనే 45 ఏళ్ల వ్యక్తి తనను కట్నం కోసం వేధిస్తున్నాడని 25వ భార్య అయిన తానియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు 27వ భార్య ఇంట్లో ఉన్న యాసీన్ ను అరెస్టు చేసి జైలుకు రిమాండుకు తరలించారు.
తనకు గతంలో రెండే పెళ్లిళ్లు జరిగాయని అబద్ధం చెప్పి 2011లో తనను పెళ్లాడాడని, తనకు కూతురు పుట్టాక కట్నం కోసం వేధించాడని పోలీసులకు తానియా సమర్పించిన ఫిర్యాదులో పేర్కొంది.