బంగ్లాదేశ్ ప్రధానికి ఉల్లి సెగ... ఇంట్లో 'ఉల్లి' లేకుండా వంటలు

onions
ఠాగూర్| Last Updated: శనివారం, 5 అక్టోబరు 2019 (10:10 IST)
ఉల్లిఘాటు సరిహద్దులను దాటిపోయింది. ఇప్పటికే దేశంలో ఉల్లిఘాటు తీవ్రంగా ఉంది. ఫలితంగా ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని తాకాయి. వీటిని కిందికి దించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా ఉల్లి ఎగుమతులపై తాత్కాలిక నిషేధం విధించింది. దీంతో దేశ వ్యాప్తంగా ఉల్లధరలు కొంతమేరకు తగ్గాయి.

కానీ, ఆసియా దేశాల్లో మాత్రం ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఉల్లి ఎగుమతులపై భారత్ విధించిన నిషేధం పుణ్యమాని ఉల్లిఘాటు సరిహద్దులను దాటిపోయింది. ఈ సెగ పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌కు ఎక్కువగా తగిలింది. దీంతో వంటల్లో ఉల్లిపాయ వేయవద్దంటూ తన వంటమనిషికి సూచించానంటూ బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా తెలిపారు.

శుక్రవారం ఢిల్లీలో జరిగిన భారత్-బంగ్లాదేశ్‌ బిజినెస్‌ ఫోరంలో ఆమె పాల్గొన్నారు. 'మీరు (భారత్‌) ఎందుకు ఉల్లి ఎగుమతిని ఆపారో తెలీదు. కానీ ఇలాంటి పరిస్థితి వస్తే ముందే చెబితే బాగుండేది. మీరు హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడంతో మాకు ఇబ్బంది కలుగుతోంది. భవిష్యత్తులో మాత్రం ఇలాంటి పరిస్థితి వస్తే ముందే చెప్పండి' అని కోరారు.

ఆ తర్వాత భారత వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య వ్యాపారం జరిగే పలు ఉమ్మడి అంశాలు ఉన్నాయని తెలిపారు. కోల్‌కతా, ఖుల్నాల మధ్య నడుస్తున్న బంధన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును, రెండు సార్లకు పెంచాలని భావిస్తున్నామన్నారు.దీనిపై మరింత చదవండి :