శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 4 సెప్టెంబరు 2019 (10:34 IST)

ఫ్రెండ్‌తో కలిసి షిప్ బిల్డింగ్ కాంప్లెక్స్‌లో నరేంద్ర మోడీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యాలో పర్యటిస్తున్నారు. ఆయన పర్యటన రెండు రోజుల పాటు కొనసాగనుంది. ఈ పర్యటన సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ పర్యటనలో తూర్పు దేశాల ఆర్థిక సదస్సుతో పాటు భారత్-రష్యా 20వ వార్షిక సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య దాదాపు 25 కీలక ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు సంతకాలు చేయనున్నారు. 
 
ఇదిలావుంటే, ఈ పర్యటనలో తన స్నేహితుడైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి ప్రధాని మోడీ జ్వెజ్దా షిప్ బిల్డింగ్ కాంప్లెక్స్‌ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించారు. తన పర్యటనలో భాగంగా, తక్కువ ధరకే ఆయుధాలను తయారు చేసే టెక్నాలజీని భారత్‌కు అందించే అంశంపై మోడీ రష్యా అధికారులతో చర్చించనున్నారు. 
 
ఈ టెక్నాలజీ మనకు అందింతే, తృతీయ శ్రేణి ప్రపంచ దేశాలను భారత్ అతి తక్కువ ధరకే ఆయుధాలను సరఫరా చేసే అవకాశం ఉంటుంది. తద్వారా ఆయుధాల వ్యాపారంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.