మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 జులై 2020 (10:12 IST)

ఎలుగుబంటి పక్కనే వచ్చి నిలబడితే.. ఆ మహిళ సెల్ఫీ తీసుకుంది.. (Video)

Bear
ఎలుగుబంటిని చూస్తే జనం జడుసుకుంటారు. అలాంటిది ఓ ఎలుగుబంటి పక్కనే నిలబడితే ఇంకేమైనా వుందా.. భయంతో ఇంకేం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి సంఘటనే మెక్సికోలోని చినిక్‌ ఎకోలాజికల్‌ పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళకు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అయితే ఆమె ఏమాత్రం భయపడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించింది. 
 
వివరాల్లోకి వెళితే.. మెక్సికోలోని చినిక్‌ ఎకోలాజికల్‌ పార్కులో తన వద్దకు వచ్చిన ఎలుగుబంటి నుంచి తప్పించుకునేందుకు ఓ పర్యాటకురాలు నిల్చున్న చోటే బొమ్మలా ఉండిపోయి.. ఎలుగుబంటితో సెల్ఫీ కూడా తీసుకుంది. అయితే కాసేపటికి మళ్లీ అది వెనక్కి వచ్చి కాళ్లను పామడంతో అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. అంతే ఆపై హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంది. 
 
ఇందుకు సంబంధించిన వీడియోను ఎన్‌బీఏ మాజీ ఆటగాడు రెక్స్‌ చాప్‌మన్‌ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఎలుగుబంటి అంత దగ్గరగా వచ్చినా ఏమాత్రం బెదరకుండా ధైర్యం ప్రదర్శించిన మహిళపై ప్రశంసలు కురిపించాడు. ఆమె నరాలు ఉక్కుతో తయారుచేశారేమో... అతడితో తను సెల్ఫీ తీసుకుందంటూ కొనియాడాడు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియోను ఇప్పటికే లక్షలాది మంది వీక్షించారు.