గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 డిశెంబరు 2023 (10:03 IST)

భారత రిపబ్లిక్ వేడుకలకు జో బైడెన్ గైర్హాజరు?

joe biden
భారత గణతంత్ర వేడుకలు జనవరి 26వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిఘా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వస్తారంటూ ఇంతవరకు ప్రచారం జరిగింది. అయితే, ప్రస్తుతం ఆయన భారత పర్యటనకు రావడం లేదని తెలుస్తుంది. 
 
జనవరి చివరిలో లేదా ఫిబ్రవరి ఆరంభంలో ప్రెసిడెంట్ బిడెన్ 'స్టేట్ ఆఫ్ ది యూనియన్' ప్రసంగం చేయాల్సి ఉండడం, మరోవైపు ఎన్నికల ప్రచారం, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై అమెరికా ప్రత్యేక దృష్టిసారించిన నేపథ్యంలో భారత్‌లో పర్యటించరాదని, ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ మేరకు భారత్‌కు అమెరికా అధ్యక్ష కార్యాలయం సమాచారం చేరవేసినట్టు తెలుస్తుంది. 
 
కాగా, జనవరి 26, 2024వ తేదీన జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా అధ్యక్షుడు బిడెన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించారని భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి సెప్టెంబర్ నెలలో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే గణతంత్ర దినోత్సవ వేడుకలకు బైడెను ముఖ్యఅతిథిగా ఆహ్వానించినట్టు భారత్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 
 
చావనైనా చస్తాను గానీ... ఢిల్లీ మాత్రం వెళ్లను.. శివరాజ్ సింగ్ చౌహాన్  
 
తాను చావనైనా చస్తాను గానీ, ఢిల్లీ మాత్రం వెళ్లను అని మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చౌహాన్.. ఐదోసారి ముఖ్యమంత్రి పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆయన స్థానంలో కొత్తగా మోహన్ యాదవ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేశారు. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ మద్దతుదారులైన కొందరు మహిళలు ఆయన వద్దకు వెళ్లి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కూడా భావోద్వేగానికి గురయ్యారు. 
 
వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, "చావనైనా చస్తాను గానీ, నాకు ఇది కావాలి, నాకు అది కావాలని అని అడగడానికి మాత్రం ఢిల్లీకి వెళ్లను అని తేల్చి చెప్పారు. అలాంటివి తనకు నచ్చవని పునరుద్ఘాటించారు. అదేసమయంలో ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు గెలుచుకోలేని చింద్వారా ప్రాంతానికి వెళ్లిపోయారు. తన చర్య ద్వారా ఆయన అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లకుండా చింద్వారా వెల్లడం ప్రతి ఒక్కరీ ఆశ్చర్యానికి గురి చేసింది.