గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2024 (17:00 IST)

ఆకాశంలో 28న అత్యంత అరుదైన తోక చుక్క.. మన కళ్లతో చూడొచ్చు

Bright Space Rock
Bright Space Rock
ఆకాశంలో తోకచుక్కలు కనిపించడం అరుదు. జీవితకాలంలో ఒక్కసారే వచ్చే అత్యంత అరుదైన క్షణమని, అంతరిక్ష కేంద్రం నుంచి వీడియో తీసి నాసా వ్యోమగామి పంపారు. ఈ నెల 28న అత్యంత అరుదైన తోక చుక్క కనిపించనుందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. 
 
ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా ఈ తోకచుక్కను ఎలాంటి పరికరాల అవసరం లేకుండానే నేరుగా మన కళ్లతో చూడొచ్చని తెలిపారు. 
 
బైనాక్యులర్‌తో చూస్తే మరింత స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. ఈ నెల 28న ఆకాశంలో కనువిందు చేసే ఈ తోకచుక్క అక్టోబర్ 10న కూడా కనిపించే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
 
ప్రస్తుతం ఈ తోకచుక్క మరోసారి భూమికి దగ్గరగా రానుందని, శుక్రవారం తెల్లవారుజామున ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపిస్తుందని చెప్పారు. దాదాపు 80 వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు చూసిన ఓ తోక చుక్క మళ్లీ ఇప్పుడు దర్శనమివ్వబోతోందన్నారు.