శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

చెన్నై టెస్ట్ మ్యాచ్ : బంగ్లాపై 280 రన్స్ తేడాతో భారత్ ఘన విజయం

Rajkot Test
చెన్నై వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌ ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు అశ్విన్ ఆరు వికెట్లు, రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీయడంతో బంగ్లా ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. దీంతో భారత్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 
 
ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ కేవం 149 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 287 పరుగులు చేసింది. ఫలితంగా బంగ్లాదేశ్ ముంగిట 515 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. 516 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. తన రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు అలౌట్ అయింది. 
 
515 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు చేజార్చుకుని 158 పరుగులు చేసింది. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సొంతగడ్డపై విజృంభించాడు. చివరి సెషన్‌లో 3 కీలకమైన వికెట్లు తీసి బంగ్లాదేశ్‌ను దెబ్బకొట్టాడు. ఓపెనర్ షాద్మాన్ ఇస్లాం (35), మొమినుల్ హక్ (13), ముష్ఫికర్ రహీమ్ (13) వికెట్లు అశ్విన్ ఖాతాలో చేరాయి. బుమ్రాకు ఒక వికెట్ దక్కింది. 33 పరుగులు చేసిన ఓపెనర్ జకీర్ హుస్సేన్ ను బుమ్రా అవుట్ చేశాడు. 
 
బంగ్లా జట్టులో నజ్ముల్ హుస్సేన్ శాంటో ఒంటరిపోరాటం చేసి 82 పరుగులు చేశాడు. దీంతో భారత్ 280 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ నాలుగు రోజుల్లోనే ముగిసిపోయింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.