బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 2 నవంబరు 2017 (10:51 IST)

జర్నలిస్టు తొడపై చేయివేసి వేధింపులు... మంత్రిపదవికి రిజైన్... ఎవరు?

బ్రిటన్ రక్షణ కార్యదర్శి (మంత్రి) మైఖేల్ ఫాల్లోన్ ఉన్నారు. ఈయన పేరు ఆ దేశ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోనుంది. మహిళా జర్నలిస్టు తొడపై చేయి వేసి పదవికి రాజీనామా చేసిన తొలి బ్రిటన్ పార్లమెంటేరియన్‌గా ఆ

బ్రిటన్ రక్షణ కార్యదర్శి (మంత్రి) మైఖేల్ ఫాల్లోన్ ఉన్నారు. ఈయన పేరు ఆ దేశ చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోనుంది. మహిళా జర్నలిస్టు తొడపై చేయి వేసి పదవికి రాజీనామా చేసిన తొలి బ్రిటన్ పార్లమెంటేరియన్‌గా ఆయన నిలిచారు. 
 
ఇటీవలి కాలంలో సెలబ్రిటీలు, ప్రముఖుల లైంగిక వేధింపులు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్న విషయం తెల్సిందే. తాజాగా బ్రిటన్ రక్షణ కార్యదర్శి మైఖేల్ ఫాల్లోన్ పేరు కూడా లైంగిక వేధింపులకు సంబంధించి వినిపించింది. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తాను మహిళలను వేధించిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. 
 
తన రాజీనామా లేఖను ప్రధాన మంత్రి థెరిసా మేకు ఆయన పంపించారు. ప్రస్తుతం తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని... అయితే, గతంలో మాత్రం తాను తప్పులు చేసిన మాట నిజమేనని రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. కార్యదర్శి పదవికి రాజీనామా చేసినప్పటికీ, ఎంపీగా మాత్రం కొనసాగుతానని ఆయన ప్రకటించారు. మరోవైపు మైఖేల్ నిర్ణయాన్ని ప్రధాని థెరిసా ప్రశంసించారు. విచారణలో అన్ని విషయాలు వెలుగు చూస్తాయని ఆమె అన్నారు.
 
కాగా, 2002లో జూలియా అనే మహిళా జర్నలిస్టు తొడల మీద చేతులు వేసి, అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. 15 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై గత వారం ఆయన క్షమాపణలు చెప్పారు. అయితే, ఆయనపై మళ్లీ లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో మనస్తాపం చెందిన ఆయన తన పదవికి రాజీనామా చేశారు.