గురువారం, 17 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 7 మే 2016 (13:48 IST)

ఫేస్‌బుక్ అనేది పాపానికి ద్వారం... మహిళలు బాగా చెడిపోతున్నారు... అకౌంట్లు డిలీట్ చేయండి

ఫేస్‌బుక్ కారణంగా మహిళలు బాగా చెడిపోతున్నారని బ్రిటన్‌లోని ముస్లిం మతాధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. అందువల్ల ముస్లింలు తక్షణం ఫేస్‌బుక్ ఖాతాలు ఉన్నట్టయితే తక్షణం డిలీట్ చేయాలని ఆదేశాలు జారీచేశారు. అంతేకాకుండా, ప్యాంట్లు వేసుకోవద్దని, అసలు భర్త అనుమతి లేకుండా ఇంటి నుంచి బయటకే రావద్దంటూ నిబంధనలు విధించారు. 
 
లండన్‌లోని ఇస్లామిక్ సెంటర్, క్రోయ్‌డాయ్ మసీదు, సెంట్రల్ మసీదు ఆఫ్ బ్లాక్ బర్న్ కలిసి ఈ నిబంధనలను రూపొందించాయి. ఫేస్‌బుక్ అనేది పాపానికి ద్వారాలు తెరుస్తుందనీ, దీని ద్వారా ముస్లిం మహిళలు బలవుతున్నారని సూచించింది. బయటేకాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మహిళలు ప్యాంట్లు వేసుకోవద్దని నిబంధన విధించింది. అయితే ఈ నిబంధనలపై ముస్లిం మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. కాలం చెల్లిన విధానాలను ఇంకా తమపై రుద్దవద్దని ఇస్లామిక్ షరియా కౌన్సిల్ నాయకురాలు ఖోలా హసన్ డిమాండ్ చేశారు.