మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (17:05 IST)

కెనడా పార్లమెంట్ ఎన్నికలు : భారతీయ సంతతి ఎంపీల విజయకేతనం

కెనడా పార్లమెంట్‌కు తాజాగా జరిగిన ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీల్లో ఏకంగా 17 మంది భారతీయ సంతతి ఎంపీలు ఉండటం గమనార్హం. అదేసమంయలో కెన‌డా ప్ర‌ధానిమంత్రిగా మూడోసారి జ‌స్టిన్ ట్రూడో ఎన్నిక‌య్యారు. అధికార లిబ‌ర‌ల్ పార్టీ మెజార్టీ దక్కకపోయినప్పటికీ తిరిగి ఆ పార్టీనే అధికారంలోకి రానుంది. 
 
జ‌గ్‌మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్ర‌టిక్ పార్టీ 27 సీట్లు గెలిచి కీల‌కంగా మారింది. జ‌గ్‌మీత్ మ‌ద్ద‌తులోనే ట్రూడో కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నున్నారు. మాజీ మంత్రులు టిమ్ ఉప్ప‌ల్‌, హ‌ర్జిత్ సింగ్ స‌జ్జ‌న్‌, బర్దిశ్ చాగ‌ర్‌, అనితా ఆనంద్‌లు కూడా మ‌ళ్లీ ఎన్నిక‌య్యారు. వాంకోవ‌ర్ నుంచి ర‌క్ష‌ణ మంత్రి హ‌ర్జిత్ సింగ్ స‌జ్జ‌న్ రెండోసారి గెలిచారు. 
 
వాట‌ర్‌లూ సీటు నుంచి ఛాగ‌ర్ విజ‌యం సాధించారు. బ్రిటీష్ కొలంబియా నుంచి సుఖ్ ద‌లివాల్‌, స‌ర్రీ సెంట‌ర్ నుంచి ర‌ణ్‌దీప్ సింగ్ సారాయి గెలిచారు. క్యుబెక్ నుంచి ఇండో కెన‌డియ‌న్ అంజూ ధిల్లాన్ మ‌రోసారి ఎంపీ అయ్యారు. కాల్గ‌రి ఫారెస్ట్ లాన్ స్థానం నుంచి జ‌స్‌రాజ్ సింగ్ హ‌ల్ల‌న్ విక్ట‌రీ కొట్టారు. 
 
ఎడ్మంట‌న్ మిల్ వుడ్స్ నుంచి ఉప్ప‌ల్ మ‌రోసారి గెలుపొందారు. ఒంటారియాలో న‌లుగురు సిట్టింగ్ ఇండో కెన‌డియ‌న్లు విజ‌యం సాధించారు. ఎంపీలు మ‌ణింద‌ర్ సిద్దూ, రూబీ స‌హోటా, సోనియా సిద్దు, క‌మ‌ల్ ఖేరాలు గెలిచారు. నేపియ‌న్ సీటు నుంచి చంద్ర ఆర్యా విజ‌యం సాధించారు.