గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 16 ఫిబ్రవరి 2017 (14:46 IST)

1985.. ఎయిరిండియా కనిష్క కూల్చివేత.. 329 మంది మృతి.. నిందితుడు విడుదల

1985 జూన్ 23 న 329 మందితో కెనడా-మాంట్రియల్-ఢిల్లీ రూట్ లో వెళ్తున్న ఎయిరిండియా విమానం కనిష్క (182)ను బాంబులతో మిలిటెంట్లు పేల్చివేశారు. నాడు కెనడా చరిత్రలోనే ఇదో మాస్ మర్డర్ గా మిగిలింది. ఈ ఘటనలో విమా

1985 జూన్ 23 న 329 మందితో కెనడా-మాంట్రియల్-ఢిల్లీ రూట్ లో వెళ్తున్న ఎయిరిండియా విమానం కనిష్క (182)ను బాంబులతో మిలిటెంట్లు పేల్చివేశారు. నాడు కెనడా చరిత్రలోనే ఇదో మాస్ మర్డర్ గా మిగిలింది. ఈ ఘటనలో విమాన సిబ్బందితో పాటు 329 మంది ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు మిలిటెంట్లు పట్టుబడ్డారు. ఈ కేసుకు సంబంధించి దోషి అయిన ఇందర్జిత్ సింగ్ రేయాత్‌ని జైలు శిక్ష నుంచి కెనడాలోని పెరోల్ బోర్డు విముక్తి కల్పించింది. 
 
సిక్కు ఇమ్మిగ్రెంట్ అయిన ఇతగాడు తొమ్మిదేళ్ళ జైలుశిక్షలో ఇప్పటికే సుమారు ఆరేళ్ళు శిక్ష అనుభవించగా.. నాటి విమాన ఘటన.. బాంబింగ్ కేసు దోషుల్లో ఇందర్జిత్ ఒక్కడే మిగిలిపోయాడు. 2011లో ఇతడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. గత ఏడాది విడుదలైనప్పటికీ.. గృహనిర్భంధం చేశారు. కానీ ఈ  కేసులో ఒక్కడే దోషిగా తేలిన ఇందర్జిత్ కూడా జైలు నుంచి విడుదలయ్యాడు.