శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 16 మే 2017 (15:15 IST)

పార్లమెంట్‌లో పిల్లాడితో ఆడుకున్న కెనడా ప్రధాన మంత్రి (ఫోటోలు)

కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడూ తన మూడేళ్ల కుమారుడితో పార్లమెంట్‌కు వచ్చారు. తన మూడేళ్ల కుమారుడిని పార్లమెంట్‌కు తీసుకొచ్చిన ప్రధాని.. సభ్యులందరినీ ఆకట్టుకున్నారు. తన మూడేళ్ల పిల్లాడు చేసే చిలిపి చే

కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడూ తన మూడేళ్ల కుమారుడితో పార్లమెంట్‌కు వచ్చారు. తన మూడేళ్ల కుమారుడిని పార్లమెంట్‌కు తీసుకొచ్చిన ప్రధాని.. సభ్యులందరినీ ఆకట్టుకున్నారు. తన మూడేళ్ల పిల్లాడు చేసే చిలిపి చేష్టలకు పార్లమెంట్ సభ్యులంతా ముగ్ధులయ్యారు. కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన జస్టిన్ తన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల మద్దతును చూరగొన్నారు. 
 
వలసదారుల సమస్య వంటి ఎలాంటి సమస్యనైనా సునాయాసంగా పరిష్కరిస్తూ.. దూసుకెళ్తున్న జస్టిన్‌కు కెనడాలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గౌరవమర్యాదలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన మూడేళ్ల కుమారుడు హడ్రియన్‌తో తన కార్యాలయానికి వెళ్లారు జస్టిన్.
 
ఓ వైపు పనికి ఎలాంటి ఆటంకం కలగనీయకుండా పనిచేస్తూనే తన కుమారుడితో ఆడుకునేందుకు సమయం కేటాయించారు. కెనడా ప్రధాని తన కుమారుడితో ఆడుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలకు కామెంట్లు, లైక్లు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి.