శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 సెప్టెంబరు 2021 (21:23 IST)

ఐకమత్యంతో ప్రాణాలు కాపాడుకున్న చిరుత పులులు.. ఎక్కడ?

cheetahs
ఐకమత్యమే మహాబలం అనేందుకు అనేక కథలు వాడుకలో వున్నాయి. తాజాగా ఐక్యమత్యంతో ఎలాంటి శత్రువునైనా అంతమొందించవచ్చు అనేందుకు ఈ ఘటనే ఉదాహరణ. కెన్యా దేశంలోని మాసాయ్‌ మారా నేషనల్‌ రిజర్వు ఫారెస్ట్‌లో ఇప్పుడు కుండపోత వాన కురుస్తోంది.
 
దీంతో ఈ వానలకు తాలేక్‌ నది తీవ్రంగా ప్రవహిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంత ఉగ్రరూపం దాల్చిందనే చెప్పాలి. ఇక ఇలాంటి సమయంలో ఒడ్డుకు ఇటు వైపు ఉన్న ఐదు చిరుత పులలు ఎలాగైనా సరే నదిని దాటేందుకు బాగానే ప్రయత్నిస్తున్నాయి. 
 
కానీ ధైర్యం చాలక అటూ ఇటూ తిరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఆ నదిని దాటాలనుకుంటే వరద ఏ క్షణంలో మింగేస్తుందో తెలియదు.
 
పైగా ఇప్పడు నది తీవ్రంగా ప్రవహించడంతో ఆ చిరుతలు భయపడిపోతున్నాయి. ఇంకోవైపు ఆ నదిలోని భయంకరమైన మొసళ్లు కూడా ప్రాణాలు తీసేందుకు రెడీగా ఉంటాయి. ఈ కారణంగా ఎలాగైనా నదిని దాటాలి అనుకుని ఒకేసారి భయం వీడి ఒక్కటిగా దూకాయి. 
 
ఇంకేముంది ఐకమత్యంగా ఉండటంతో వరద భయం వాటిని ఏమీ చేయలేదు. మొసళ్లు కూడా వాటి దగ్గరకు రాలేదు. ఇలా కలిసికట్టుగా ఆ చిరుతలు అన్నీ కూడా ఆ నదిని దాటాయి. క్షేమంగా తమ రాజ్యానికి చేరుకున్నాయి. ఈ చిరుతలు ఐకమత్యంగా ఉండటంతో ప్రాణాలు దక్కించుకున్నాయి.