గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 జూన్ 2022 (13:35 IST)

ఖండాంతర క్షిపణులను అడ్డుకునే యాంటీ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం

china antiballistic missile
భారత్‌కు శత్రుదేశంగా ఉన్న చైనా ఆదివారం రాత్రి యాంటీ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని చైనా రక్షణ శాఖ వెల్లడించింది. ఉపరితలంపై నుంచి ప్రయోగించే క్షిపణి సాయంతో ఈ ప్రయోగం చేపట్టినట్టు తెలిపింది. ఇది కేవలం చైనా ఆత్మరక్షణ చర్యల్లోభాగంగానే చేపట్టినట్టు పేర్కొంది. 
 
కాగా, ఇటీవలి కాలంలో చైనా తన రక్షణ సంపత్తిని భారీగా పెంచుకుంటూ వస్తుంది. ఇందులోభాగంగా రక్షణ కోసం యాంటీ బాలిస్టిక్‌ మిసైల్‌ను అభివృద్ధి చేసింది. ఇది ఖండాంతర క్షిపణులు, ఇతర ప్రొజెక్టైల్స్‌ను అడ్డుకొంటుంది. 2010 నుంచి చైనా ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తోంది. చైనా చేపట్టిన ఆరోపరీక్ష ఇది. గతంలో 2021 ఫిబ్రవరిలో నిర్వహించింది. ఉత్తర కొరియా - దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతోన్న నేపథ్యంలో ఈ క్షిపణి పరీక్ష జరగడం గమనార్హం. 
 
అమెరికా ఈ ప్రాంతంలో దక్షిణ కొరియాతో కలిసి ఇటీవల క్షిపణి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 2016లో దక్షిణ కొరియాపై ఉ.కొరియా దాడి చేస్తుందనే భయంతో టర్మినల్‌ హై ఆల్టిట్యూడ్‌ ఏరియా డిఫెన్స్‌ వ్యవస్థను మోహరించింది. ఈ విషయంలో చైనా-దక్షిణ కొరియా మధ్య విభేదాలు తలెత్తాయి. తమ జాతీయ భద్రతను ఈ క్షిపణి రక్షణ వ్యవస్థ దెబ్బతీస్తుందని చైనా వాదించింది.