గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 జూన్ 2022 (10:54 IST)

చంద్రుడిపై నీటి ఉనికి: మూలాల గుర్తింపు.. చైనా వెల్లడి

moon
చంద్రుడిపై నీటి ఉనికిని గతంలో ధృవీకరించిన చైనా ల్యాండర్ చాంగే-5 ప్రస్తుతం చంద్రుడి ఉపరితలంపై దాని మూలాన్ని నిర్ధారించింది. 2020లో, చాంగే-5 ఆన్-బోర్డ్ స్పెక్ట్రల్ విశ్లేషణ ద్వారా 11 బసాల్ట్ శిలలు, మట్టి నమూనాలలో నీటి సంకేతం యొక్క మొదటి రియల్-టైమ్, ఆన్-సైట్ ఖచ్చితమైన ధృవీకరణను అందించింది చైనా. 2021లో ల్యాండర్ తిరిగి వచ్చిన ఎనిమిది నమూనాల ప్రయోగశాల విశ్లేషణ ద్వారా 2021లో మళ్ళీ కనుగొనబడింది. ఇప్పుడు, చాంగ్'ఇ-5 బృందం నీరు ఎక్కడి నుండి వచ్చిందో నిర్ధారించి, వాటి ఫలితాలను నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో ప్రచురించింది.
 
"ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చంద్ర నమూనాలలో 'నీటి' ఉనికి, రూపం మరియు పరిమాణాన్ని పరిశీలించడం జరిగింది" అని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (ఎన్ఎఒసి) యొక్క నేషనల్ ఆస్ట్రానమికల్ అబ్జర్వేటరీస్‌కు చెందిన ఎల్ఐ చున్లై చెప్పారు.
 
ఈ ఫలితాలు చాంగే-5 ల్యాండింగ్ జోన్లో నీటి పంపిణీ లక్షణాలు, నీటి వనరుల ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం ఇస్తాయని చున్లై అన్నారు. చాంగే-5 చంద్ర నదులను లేదా ఊటలను గమనించలేదు. బదులుగా ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై రాళ్ళు మరియు మట్టిలో సగటున మిలియన్ కు 30 హైడ్రాక్సిల్ భాగాలను గుర్తించింది.. అని చున్లై వెల్లడించారు.
 
మరోవైపు తాము నిర్మించిన స్కైఐ అనే భారీ టెలిస్కోపు విశ్వంలో జీవాన్ని గుర్తించి ఉండవచ్చని చైనా ప్రభుత్వానికి చెందిన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ డెయిలీ పేర్కొంది. ఈ టెలిస్కోప్‌ విశ్వంలో నారో బ్యాండ్‌ ఎలక్ట్రోమాగ్నటిక్‌ సిగ్నల్స్‌ను గుర్తించిందని బీజింగ్‌ నార్మల్‌ యూనివర్సిటీ, చైనా అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌, యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా బృందాలతో కలిసి పనిచేస్తున్న శాస్త్రవేత్త జియాంగ్‌ టాన్జే వెల్లడించారు.