ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (09:36 IST)

ప్రజలను ఫూల్స్‌ను చేయొద్దు.. వైఖరి మార్చుకోండి : చైనాకు దలైలామా చురక

డ్రాగన్ కంట్రీ చైనాకు బౌద్ధమత ఆధ్యాత్మిక గురువు దలైలామా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో దలైలామా పర్యటించడాన్ని చైనా తీవ్రంగా తప్పుబడుతోంది. దీనిపై తలైలామా స్పందిస్తూ.. 1959లో టిబె

డ్రాగన్ కంట్రీ చైనాకు బౌద్ధమత ఆధ్యాత్మిక గురువు దలైలామా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో దలైలామా పర్యటించడాన్ని చైనా తీవ్రంగా తప్పుబడుతోంది. దీనిపై తలైలామా స్పందిస్తూ.. 1959లో టిబెట్‌ నుంచి వచ్చి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నట్టు చెప్పారు. 
 
తన పర్యటనలో చైనా ఒక అధికారిని నియమించాలని కోరారు. అప్పుడైనా తాను ఎక్కడ పర్యటిస్తున్నానో, ఏం మాట్లాడుతున్నానో.. ఏం చేస్తున్నానో.. చైనా ప్రజలకు తెలుస్తుందని ఆయన అన్నారు. దలైలామా గురించి నిజం తెలుసుకోవాల్సిన హక్కు, అధికారం 135 కోట్ల చైనా ప్రజలపై ఉందన్నారు. 
 
కేవలం తప్పుడు సమాచారాన్ని మాత్రమే తెలుసుకుంటున్నారని, నిజమేంటో తెలుసుకోవాలని చైనా ప్రజలకు సూచించారు. ఈ పర్యటన కేవలం మతానికి సంబంధిన విషయమని భారత్‌ చెబుతున్నప్పటికీ దీన్ని వక్రీకరించి మరింత క్లిష్టపరిస్థితులు ఏర్పడేలా చైనా ప్రవర్తిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.