శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 అక్టోబరు 2022 (09:33 IST)

చైనా మళ్లీ పంజా విసిరిన కరోనా - కట్టడికి లాక్డౌన్

corona visus
చైనాలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసిరింది. ఈ వైరస్ మరింతగా వ్యాపించకుండా మళ్లీ పలు నగరాల్లో లాక్డౌన్ విధించారు. దీంతో పలు నగరాల్లో ప్రజలు తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. 
 
తాజాగా ఉత్తర చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో ఉన్న ఫెన్‌యాంగ్ సిటీలో లాక్డౌన్ విధించారు. సిటీలో వైరస్ టెస్టింగ్ నిర్వహిస్తున్న సమయంలో కొన్ని పాజిటివ్ కేసులను గుర్తించారు. అలాగే, ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో ఉన్న రాజధాని హోహాట్‌లో ఆంక్షలు విధించారు. బయట నుంచి వచ్చే వాహనాలను నిలిపివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. గడిచిన 12 రోజుల్లో ఈ ఒక్క నగరంలోనే దాదాపు 12 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. 
 
కాగా, డ్రాగన్ కంట్రీలో ఈ నెల వారంలో జాతీయ సెలువులు దినాల‌ను ప్రజలు ఎంజాయ్ చేశారు. వాస్తవానికి ప్రయాణాలు త‌గ్గించుకోవాల‌ని నిబంధ‌న‌లు ఉన్నా.. ప్రజ‌లు మాత్రం ఆ సెలవు రోజుల్లో తెగ తిరిగారు. దీంతో మ‌ళ్లీ చైనాలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. 
 
ఈ కేసులు భారీగా పెరుగుతుండటంతో కొన్ని ప‌ట్టణాల్లో సోమ‌వారం నుంచి మ‌ళ్లీ లాక్‌డౌన్లు ప్రారంభించారు. కేసుల సంఖ్య మూడు రెట్లు పెరిగిన తర్వాత చైనాని ప్రధాన నగరాల్లో పరిమితులను విధించినట్లు అక్కడి మీడియా తెలిపింది.
 
మ‌రోవైపు, వ‌చ్చే వారం నుంచి బీజింగ్‌లో క‌మ్యూనిస్టు పార్టీ స‌మావేశాలు జ‌ర‌గనున్న నేప‌థ్యంలో ముంద‌స్తుగానే లాక్డౌన్ అమ‌లు చేస్తున్నట్లు అర్థమ‌వుతోంది. క‌రోనా నియంత్రణ విష‌యంలో చైనా ఇంకా క‌ఠిన ఆంక్షలను అమ‌లు చేస్తోంది.