శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 సెప్టెంబరు 2021 (15:14 IST)

ఆప్ఘనిస్థాన్‌కు 31 మిలియన్ డాలర్ల చైనా భారీ సాయం

తాలిబన్ల అధికారంలో వున్న ఆప్ఘనిస్థాన్‌కు చైనా భారీ సాయం అందించింది. ఇప్పటికే ఆప్ఘన్ పాకిస్థాన్‌కు అండగా ఉంటామని ప్రకటించింది. తాజాగా చైనా భారీ ఉద్దీపన సాయం ప్రకటించింది. ఆప్ఘానిస్తాన్‌కు 31 మిలియన్ యూఎస్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది చైనా. 
 
మన కరెన్సీలో ఇది 223 కోట్ల రూపాయలతో సమానం. ఆప్ఘనిస్థాన్‌లో అస్థిర పరిస్థితులున్నాయని… ఆ దేశాన్ని స్థిరీకరించేందుకు.. కొత్త ప్రభుత్వానికి ఆసరాగా నిలబడేందుకు ఈ మాత్రం సాయం అవసరమని చైనా దేశం బుధవారం ప్రకటించింది. 
 
అలాగే ఆఫ్ఘానిస్తాన్‌కు 30 లక్షల డోసుల కరోనా టీకాలను కూడా విరాళంగా ఇవ్వనుంది చైనా. దక్షిణాసియా-చైనా దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా.. ఆప్ఘానిస్తాన్‌కు పాండెమిక్ టైం సాయం చేస్తున్నామని తెలిపింది. 
 
ఆప్ఘానిస్తాన్ పరిస్థితులపై పొరుగు దేశాల విదేశాంగ మంత్రుల మొదటి సమావేశం బుధవారం (సెప్టెంబర్ 8, 2021) జరిగింది. చైనా, పాకిస్తాన్, ఇరాన్, తజకిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల విదేశాంగ మంత్రులు, అధికారులు మీటింగ్‌కు హాజరయ్యారు. 
 
ఈ సదస్సులో పాల్గొన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి.. 220 మిలియన్ యువాన్ల సాయం ప్రకటన చేశారు. అప్ఘానిస్తాన్ అత్యవసర అవసరాలైన ఆహారం, ధాన్యం, టీకాలు, మందులు, చలికాలం వాడుకునేందుకు అవసరమైన సామాగ్రి కొనుగోలుకు ఈ నిధులు ఖర్చు చేస్తామన్నారు.