గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 మార్చి 2022 (13:49 IST)

చైనాలో విజృంభిస్తోన్న కరోనా- లాక్‌డౌన్.. 6,215 కొత్త కేసులు

చైనాలో కరోనా విజృంభిస్తోంది. కరోనాకు పుట్టినిల్లుగా ఉన్న చైనాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది. కొత్తగా ఈ దేశంలో 6,215 కొత్త కేసులు నమోదయ్యాయి. 
 
చైనాలో శుక్రవారం 4,790, శనివారం 5,600 కొత్త కేసులు నమోదయ్యాయి. జీరో కోవిడ్ స్ట్రాటజీని అవలంబిస్తున్న చైనా ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తోంది. 
 
ముఖ్యంగా చైనాలో వాణిజ్య రాజధాని అయిన షాంఘైలో లాక్ డౌన్ విధించారు. దీంతో 2.6 కోట్ల మంది ప్రజలు ఆంక్షల్లోకి వెళ్లారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.