సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 మార్చి 2022 (12:15 IST)

చైనీస్ బార్‌కోడ్‌తో పావురం.. నెల్లూరులో కలకలం

నెల్లూరు జిల్లా కలవాయి మండలం కుల్లూరు గ్రామంలో చైనీస్‌ బార్‌కోడ్‌తో ఉన్న పావురం ఒకటి కలకలం రేపింది. బజారువీధిలో ఒక భవనంపై ఎక్కువ సమయం ఉన్న తెల్ల పావురాన్ని చూసి దాన్ని పట్టుకున్నామని యువకులు తెలిపారు. 
 
పావురం ఒక కాలికి బ్యాడ్జ్, మరో కాలికి చైనీస్‌ బార్‌ కోడ్‌ ఉంది. ఇది దేనికి సంబంధించింది ఉంటుందోనని తర్జనభర్జన పడ్డామని స్థానికులు అన్నారు.
 
చెన్నై, గూడూరు పరిసర ప్రాంతాలలో పావురాల పరుగు పందేలు నిర్వహించే వారి నుంచి ఇది తప్పించుకొని వచ్చిందేమోనని కొందరు యువకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలిపామని గ్రామస్థులు చెప్పారు.