సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 మార్చి 2022 (12:19 IST)

చైనాలో కరోనా వైరస్ విజృంభణ.. స్టెల్త్‌ ఒమిక్రాన్‌‌తో భయం భయం

చైనాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. జిలిన్ ప్రావిన్సుల్లో శుక్రవారం కరోనాతో ఇద్దరు చనిపోయినట్టు తెలిపారు. కోవిడ్ పుట్టిల్లు చైనాలో మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ కేవలం 5,000 మరణాలే సంభవించినట్టు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాల్లో హైటెన్షన్ మొదలైంది. 
 
ఒమిక్రాన్‌ సబ్-వేరియంట్‌ విరుచుకుపడటంతో చైనా వణుకుతోంది. రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు వైరస్‌ తీవ్రతరం అవుతోంది. రోజు రోజుకూ పాజిటివ్‌ కేసులు రెట్టింపు సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ముందు నుంచి జీరో కోవిడ్ వ్యూహాన్ని అమలుచేస్తున్న చైనా.. తాజాగా స్టెల్త్‌ ఒమిక్రాన్‌ కేసులు ఉక్కిరిబిక్కిరవుతోంది. 
 
కోవిడ్-19 మరణాలు కూడా నమోదు అవుతుండటంతో చైనా మరింత కలవరానికి గురవుతోంది. కఠిన లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్న పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా కేసుల కట్టడి కోసం చైనా 13 నగరాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు విధించింది.