శనివారం, 2 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 మార్చి 2022 (18:37 IST)

ఇకపై నాలుగేళ్ల పాటు డిగ్రీ కోర్సులు.. పీజే ఏడాదే!?

డిగ్రీ కోర్సులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మూడేళ్లున్న డిగ్రీ కోర్సుల సంవత్సరాలను నాలుగేళ్లుగా మార్చేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. 
 
అయితే పీజీకి మాత్రం ఏడాదే కాలాన్ని పరిమితం చేయనుంది. ఇందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో మూడేళ్లకు బదులుగా కొత్త డిగ్రీ కోర్సులు ఇక నాలుగేళ్ల పాటు  అమలులోకి రానున్నాయి. 
 
కానీ మూడేళ్ల డిగ్రీని పూర్తిగా రద్దు చేసే సీన్ లేదని.. నాలుగేళ్ల డిగ్రీని నిర్వహించే దిశగా కేంద్రం సన్నాహాలు చేస్తోంది.