మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (18:39 IST)

కూలీ మోడల్‌గా మారిన స్టోరీ ఇదే.. వైరల్ ఫోటో

Model
నిన్నటి వరకు కూలీగా వున్న వ్యక్తి ఒక్కసారిగా మోడల్‌గా మారిపోయాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. కూలీ నుంచి మోడల్‌గా మారిన షాకింగ్ మేకోవ‌ర్‌ ఇంట‌ర్నెట్‌‌ను షేక్ చేస్తోంది. 
 
వివరాల్లోకి వెళితే..  రోడ్డుపై కూలిప‌ని చేసుకునే కోజికోడ్ కు చెందిన మామిక్క అనే వ్య‌క్తి స్విస్ మేకోవ‌ర్‌తో షాకిచ్చాడు. గ‌తంలో మామిక్క లుంగీ, కోటు, క‌ళ్ల‌జోడు ధ‌రించిన ఫొటోలు వైర‌ల్ అయ్యాయి.
 
వాటిని చూసిన ష‌రీక్ వ‌యాలిల్ అనే ఫొటోగ్రాఫ‌ర్ అత‌ని మేకోవ‌ర్‌ను పూర్తిగా ఛేంజ్ చేశారు. స్టైలిష్ వెడ్డింగ్ సూట్, బ్రాండెడ్ షూష్‌, క‌ళ్ల‌కు స్టైలిష్ గాగూల్స్‌, చేతిలో ట్యాబ్‌తో చిన్న వీడియోను షూట్ చేశారు. ఆ వీడియోను చూసిన మామిక్క షాక్ అయ్యాడు. 
 
అస‌లు అందులో ఉన్న‌ది త‌నేనా అనుకుని షాకయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతుంది.