సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 24 జనవరి 2022 (10:49 IST)

వామికను కెమెరాకు చూపెట్టిన అనుష్క శర్మ

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వ్యవహారంలో ఫుల్ టెన్షన్‌లో వున్నాడు. అయితే తన ఫ్యామిలీతో మాత్రం ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు. తాజాగా విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల ముద్దుల తనయ వామిక ఇన్నాళ్లకు కెమెరాకు కనిపించింది. 
 
ఇప్పటివరకు ఆ చిన్నారిని మీడియాకు చూపించకుండా కోహ్లీ, అనుష్క జాగ్రత్త పడ్డారు. గతంలో అనేక పర్యాయాలు కోహ్లీ దంపతులు వామికను ఫొటోలు తీయొద్దని మీడియాకు స్పష్టం చేశాయి. అయితే, కేప్ టౌన్‌లో దక్షిణాఫ్రికాతో టీమిండియా చివరి వన్డే సందర్భంగా అనుష్క... వామికను ఎత్తుకుని కనిపించింది.
 
ఈ మ్యాచ్‌లో కోహ్లీ అర్ధసెంచరీ పూర్తిచేసుకోగా, కెమెరాలు ఒక్కసారిగా అనుష్కవైపు తిరిగాయి. దాంతో ఆమె వామికను కూడా కెమెరాలు ఫ్రేమ్ లో బంధించాయి.