శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (18:43 IST)

ప్రపంచ నెం.1 కార్ల్‌సన్‌కు షాకిచ్చిన 16 ఏళ్ల భారత చెస్ స్టార్ (video)

GM Praggnanandhaa
16 ఏళ్ల భారత్ చెస్ జిఎం ప్రగ్నానందా ప్రపంచ నెంబర్ 1 చెస్ ఆటగాడు కార్ల్‌సన్‌కు షాకిచ్చాడు. అతను వరుసగా మూడు ఆటలను కోల్పోయినా.. డే వన్ తరువాత, 16 ఏళ్ల చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రగ్నానందా సోమవారం ఎయిర్ థింగ్స్ మాస్టర్స్ రాపిడ్ ఆన్ లైన్ చెస్ టోర్నమెంట్, ఎనిమిదవ రౌండ్లో నార్వేకు చెందిన ప్రపంచ నంబర్ 1 మాగ్నస్ కార్ల్సెన్‌ను షాక్‌కు గురిచేశాడు. 
 
గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన ఐదవ అతి పిన్న వయస్కుడుగా ప్రగ్ననందా నిలిచాడు. ఇంకా 31 ఏళ్ల కార్ల్సెన్ కు వ్యతిరేకంగా నల్లపావులతో ఆడుతున్న ప్రగ్నానందా, టార్రాష్ వైవిధ్య ఆటలో 39 కదలికలలో గెలిచాడు. ఆ విధంగా అతను కార్ల్సెన్ యొక్క మూడు వరుస విజయాల రన్‌కు బ్రేక్ వేశాడు.
 
గత 2013లో ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్ షిప్స్ యు-8 టైటిల్‌ను గెలుచుకున్న ఈ భారతీయుడు, 7 సంవత్సరాల వయస్సులో ఫిడే మాస్టర్ టైటిల్‌ను సంపాదించాడు. ప్రస్తుతం ఎనిమిది పాయింట్లు కలిగి ఉన్నాడు.
 
ఎనిమిది రౌండ్ల తరువాత ఉమ్మడి 12వ స్థానంలో ఉన్నాడు. కార్ల్‌సన్ విజయం తరువాత, ప్రగ్నానందా ఇప్పుడు రెండు విజయాలు, రెండు డ్రాలు మరియు నాలుగు ఓటములను కలిగి ఉన్నాడు. 
 
ఆదివారం, ప్రగ్నానంద వియత్నాంకు చెందిన లే క్వాంగ్ లీమ్‌తో మొదటి రౌండును డ్రా చేసుకున్నాడు ఇంకా కెనడియన్ ఎరిక్ హెన్సెన్, చైనీస్ డింగ్ లిరెన్, పోలాండ్ కు చెందిన జాన్-క్ర్జీజ్టోఫ్ డుడా చేతిలో ఓడిపోయాడు.