సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 జనవరి 2022 (13:43 IST)

16 ఏళ్ల బాలికపై కన్నతండ్రి, అన్నయ్య అత్యాచారం

ముంబైలో 16 ఏళ్ల బాలికపై కన్నతండ్రి, తోడబుట్టిన అన్నయ్య రెండేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనకు సంబంధించి బాధితురాలి తండ్రి, అన్నను పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే... తనకు ఎదురైన దారుణ అనుభవాన్ని ఆ పదో తరగతి అమ్మాయి తన స్కూలు టీచరు, ప్రిన్సిపాల్‌కు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. స్కూలు యాజమాన్యం ఓ స్వచ్ఛంద సంస్థకు విషయాన్ని చెప్పారు. వారి సాయంతో ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
2019 జనవరిలో మొదటిసారి 43 ఏళ్ల తన తండ్రి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో తెలిపింది. ఆ తర్వాత అదేనెలలో తన అన్న కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. ఈ ఘటనపై పోక్సో చట్టం నమోదు చేశారు