శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 30 నవంబరు 2022 (16:47 IST)

జపాన్‌లో ఆశ్రయం పొందిన జాక్మా?

jack ma
jack ma
చైనాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జాక్మా కొన్ని నెలల క్రితం అదృశ్యమై జపాన్‌లో ఉన్నట్లు సమాచారం. జాక్మా ఒక చైనీస్ వ్యాపారవేత్త, అతను ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆన్‌లైన్ షాపింగ్ సైట్ అలీబాబాతో పాటు యాంట్‌తో సహా కంపెనీలను నడుపుతున్నాడు. 
 
2020లో, చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు వడ్డీ వ్యాపారుల్లా వ్యవహరిస్తున్నాయని కామెంట్స్ చేశారు. చైనా సర్కారు, జాక్మా మధ్య కొనసాగుతున్న వివాదాల మధ్య చైనా ప్రభుత్వం జాక్మా యాంట్ అండ్ అలీబాబా కంపెనీలకు చెందిన రూ.3.18 లక్షల కోట్ల ఆస్తులను జప్తు చేసింది. ఆ తర్వాత జాక్మా కనిపించకుండా పోవడం మరింత కలకలం రేపింది.
 
జక్మా గృహనిర్బంధంలో ఉన్నారని, అతను మరణించారని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం జాక్మా జపాన్‌లో ఆశ్రయం పొందినట్లు వార్తలు వస్తున్నాయి. ఆరు నెలల క్రితం జపాన్‌లో కుటుంబంతో ఆశ్రయం పొంది అనేక దేశాల పర్యటనకు వెళ్లినట్లు సమాచారం.