గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 నవంబరు 2022 (18:42 IST)

మానుషి చిల్లర్ ప్రేమాయణమే ఇప్పుడు హాట్ టాపిక్..

Manushi Chilller
Manushi Chilller
మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌కు లవ్వాయణం ప్రస్తుతం బిటౌన్‌లో వార్తలు వస్తున్నాయి. ఒక పెళ్లైన బడా బిజినెస్ మెన్‌తో డేటింగ్ చేస్తుందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. ఇప్పటికే భార్యకి విడాకులు ఇచ్చిన ఆ వ్యాపారవేత్త పేరు నిఖిల్ కామత్‌. వీరిద్దరూ 2021 నుంచి డేటింగ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి.  
 
ఈ విషయం తెలిసే భార్య విడాకులు ఇచ్చేసిందని టాక్ వస్తోంది. బిజినెస్ మెన్, జెరోధా సహవ్యవస్థాపకుడు అయిన కామత్ 2019 సంవత్సరంలో ఇటలీలో అమండా అనే మహిళను గ్రాండ్‌గా వివాహం చేసుకుని 2021లో విడాకులు తీసుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో పాతికేళ్ల మానుషి పెళ్లైన వ్యక్తితో ప్రేమలో పడటంపై ఆమె ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి హ్యాపీగా విహారయాత్రలకు వెళ్తున్నారని తెలిసింది. తాజాగా వీరిద్దరూ దైవదర్శనం చేసుకున్న ఫోటో కూడా ఒకటి సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.