సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2022 (08:45 IST)

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి ఉద్యోగం ఆఫర్ చేసిన వ్యాపారవేత్త

vinod kambli
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ. ముంబైకు చెందిన ఈయన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు బాల్య స్నేహితుడు. వీరిద్దరూ ఒకే సమయంలో క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న అతి తక్కువ సమయంలోనే పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. ఫలితంగా తన క్రికెట్ కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. 
 
క్రమేణా ఫామ్‌ను కోల్పోవడంతో జాతీయ జట్టుకు కూడా దూరమయ్యాడు. ఇపుడు ఎలాంటి ఆదాయం కూడా లేదు. మాజీ క్రికెటర్లకు భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇచ్చే పింఛనుతోనే తన కుటుంబాన్ని నెట్టుకునివస్తున్నాడు. ఈ క్రమంలో తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఏదైనా పని కావాలంటూ కాంబ్లీ బహిరంగంగా విజ్ఞప్తి చేశాడు. 
 
ఈ విజ్ఞప్తి తన దృష్టికి రాగానే మహారాష్ట్రకు చెందిన వ్యాపారవేత్త సందీప్ తోరట్ స్పందించారు. వినోద్ కాంబ్లీకి తాను ఉద్యోగం ఇస్తానని, అందుకుగాను నెలకు లక్ష రూపాయలు చెల్లిస్తానని చెప్పాడు. అయితే, తానిచ్చే ఉద్యోగం క్రికెట్‌తోనే లేదా క్రీడలతోనే కూడుకున్న ఉద్యోగం కాదన్నారు. ఆర్థిక విభాగలో కాంబ్లీకి ఉద్యోగం ఇస్తానని, ఆయనకు ఇష్టమైతే తక్షణం ఉద్యోగంలో చేరవచ్చని తెలిపారు.