గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 డిశెంబరు 2020 (20:52 IST)

టీకా వేయించుకున్నాక ఆడోళ్ళకు గడ్డాలు వస్తే మాకు సంబంధం లేదు : బ్రెజిల్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు పలు రకాలైన టీకాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులోభాగంగా, ఫైజర్ కంపెనీ ఓ టీకాను తయారు చేసింది. ఈ టీకా వినియోగానికి అనుమతి ఇచ్చిన దేశాల్లో బ్రెజిల్ ఒకటి. అయితే, టీకా వేయించుకున్న పలువురిలో వివిధ రకాలైన సైడ్ ఎఫెక్టులు వస్తున్నాయి. 
 
వీటిపై బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో స్పందించారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలాంటి సమస్యలు వచ్చినా ఆ కంపెనీకి సంబంధం లేదని, ఈ విషయమై తాము చేసుకున్న ఒప్పందంలో విషయం స్పష్టంగా ఉందనిచెప్పారు.
 
వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి ముసలిగా మారినా, మహిళకు గడ్డం పెరిగినా, అబ్బాయి గొంతు అమ్మాయిలా మారినా ఫైజర్ కు సంబంధం ఉండదని, అది వ్యాక్సిన్ తీసుకున్న వారి సమస్యేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ఫైజర్‌కు ఎటువంటి సంబంధం ఉండబోదని ఆయన తేల్చి చెప్పారు. ఫైజర్ వ్యాక్సిన్‌ను బ్రెజిల్‌తో పాటు చాలా దేశాలు అత్యవసర వినియోగానికి అనుమతించిన సంగతి తెలిసిందే.